Monday, January 26, 2026
E-PAPER
Homeజాతీయంకర్రెగుట్టల్లో వరుసగా పేలిన ఐఈడీలు..11 మంది జవాన్లకు గాయాలు

కర్రెగుట్టల్లో వరుసగా పేలిన ఐఈడీలు..11 మంది జవాన్లకు గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలి 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కదలిక, IED బాంబులు అమర్చినట్లు భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందడంతో కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అనేక ఐఈడీలు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. దీంతో జవాన్లు గాయపడ్డారు. వారిని ఆర్మీ హెలికాప్టర్‌లో రాయ్‌పుర్‌కు తరలించారు. ప్రస్తుతం రాయ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది జవాన్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని బీజాపూర్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -