Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'భూ అంటూ భూతం వస్తే.. ఆగకే అమ్మాడీ'

‘భూ అంటూ భూతం వస్తే.. ఆగకే అమ్మాడీ’

- Advertisement -

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘తమ్ముడు’. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
మంగళవారం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘భూ అంటూ భూతం..’ను రిలీజ్‌ చేశారు.
మేనకోడలు బేబి దిత్యకు మేనమామ నితిన్‌ ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. ‘భూ అంటూ భూతం..’ పాటను అజనీష్‌ లోకనాథ్‌ బ్యూటీఫుల్‌గా కంపోజ్‌ చేయగా, అనురాగ్‌ కులకర్ణి, అక్షిత పోల ఆకట్టుకునేలా పాడారు. సింహాచలం మన్నేలా లిరిక్స్‌ రాశారు. ‘భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాట లాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాట లాడాలి..పుట్టగానే నేరుగా నువు పరుగెత్తలే, పట్టుకుంటూ పడుతూ నడకేనేర్చావే, భయపడి అడుగు ఆపకే..’ అంటూ సాగుతుందీ పాట అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
నితిన్‌, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్‌, బేబీ శ్రీరామ్‌ దిత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ – కేవీ గుహన్‌, ఎడిటింగ్‌ – ప్రవీణ్‌ పూడి, మ్యూజిక్‌ – అజనీష్‌ లోకనాథ్‌, నిర్మాత – దిల్‌ రాజు, శిరీష్‌,
రచన -దర్శకత్వం – శ్రీరామ్‌ వేణు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad