– తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పినా పట్టించుకోరా?
– మహారాష్ట్ర ప్రభుత్వంపై బాంబే హైకోర్టు ఆగ్రహం
– ఆమె జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ పూణె కళాశాలపై మండిపాటు
ముంబయి: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్- పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టిన ఓ విద్యార్థినిని కళాశాల నుంచి బహిష్కరించడం, అరెస్ట్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన మహారాష్ట్ర ప్రభు త్వంపైన, పూణె కళాశాలపైన బాంబే హైకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమెను అరెస్ట్ చేయడంలో ప్రభు త్వం ‘అతి’గా వ్యవహరించిందని, అది చాలా తీవ్రమైన చర్య అని అభివర్ణించింది. బాధిత విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ గౌరి గాడ్సే, జస్టిస్ సోమశేఖర్‌తో కూడిన వెకేషన్ బెంచ్.. వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని ఆమె న్యాయవాదికి సూచించింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రోజే దానిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఓ యువ విద్యార్థిని పట్ల అధికారులు ఈ విధంగా ఎలా వ్యవహరిస్తారంటూ నిలదీసింది.
‘ఆ విద్యార్థిని ఏదో పోస్ట్ చేసింది. తప్పు తెలుసుకొని క్షమా పణ కోరింది. తనను సంస్కరించుకునేందుకు ఆమెకు అవకాశం ఇవ్వడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్థినిని అరెస్ట్ చేసింది. ఆమెను ఓ క్రిమినల్‌గా చూసింది’ అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. పూణెలోని సిన్హ్‌గడ్ అకాడమీ ఆఫ్ ఇంజినీ రింగ్‌లో ఐటీ రెండో ఏడాది చదువుతున్న 19 ఏండ్ల విద్యార్థినిని ఈ నెల ప్రారంభంలో అరెస్ట్ చేశారు. ‘రిఫార్మిస్టన్’ అనే ఇన్‌స్టా ఖాతాలో ఉన్న ఓ సందేశాన్ని రీపోస్ట్ చేయడమే ఆమె చేసిన నేరం. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌తో కయ్యానికి కాలు దువ్వు తోందంటూ ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ పోస్టులో విమ ర్శలు చేశారు. దీనిపై ఆన్‌లైన్‌లో బెదిరింపులు రావడంతో ఆమె రెండు గంటల వ్యవధిలోనే ఆ పోస్టును తొలగించి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ అమెను అదే రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె జ్యుడీషియల్ కస్టడీలో యరవాడ జైలు గోడల మధ్యే ఉంటున్నారు. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు గతంలో తోసిపుచ్చింది.
హైకోర్టు కేవలం ప్రభుత్వాన్నే కాకుండా పూణె కళాశాలనూ నిలదీసింది. ‘ఎవరో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని పట్టుకొని మీరు ఓ విద్యార్థి జీవితాన్ని ఎలా నాశనం చేస్తారు?’ అంటూ మండిపడింది. ఆ పోస్టు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వ అదనపు న్యాయవాది వాదించగా కోర్టు దానితో ఏకీభవించలేదు. ‘ఒక విద్యార్థిని అప్‌లోడ్ చేసిన పోస్టు కారణంగా దేశ ప్రయోజనాలకు భంగం కలగదు. విద్యార్థులు తమ అభిప్రాయాలు తెలియజేయకుండా అడ్డుకోవాలని ప్రభు త్వం కోరుకుంటోందా? ప్రభుత్వం నుంచి ఇలాంటి రాడికల్ స్పందన వచ్చినప్పుడు ఆ వ్యక్తి మరింత రాడికల్ అవుతాడు’ అని వ్యాఖ్యానించింది. కనీస వివరణకు కూడా కళాశాల యాజ మాన్యం ఆమెకు అవకాశమివ్వలేదని కోర్టు విమర్శించింది.
విద్యా సంస్థలు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకూడదని, చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు వారికి అవకాశం ఇవ్వాలని బాంబే హైకోర్టు హితవు పలికింది. ఆ విద్యార్థినిది చాలా చిన్న వయసని, ఈ వయసులో పొరబాట్లు చేయడం సహజమేనని తెలిపింది. ఆమె ఇప్పటికే ఎంతో వేదన అనుభవించిందని అంటూ వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే విడుదలకు ఆదేశాలు జారీ చేస్తానని భరోసా ఇచ్చింది.
ఆపరేషన్ సిందూర్‌పై పోస్ట్ పెడితే…క్రిమినల్‌గా చూస్తారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES