నవతెలంగాణ-గోవిందరావుపేట : కోట్లకు పడగలెత్తిన ప్రభుత్వ ఉద్యోగి వింత నాటకం అడుగుపెడితే అంతా నాదే చేసేది ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేది కోట్లలో వ్యాపారం ఇది మండలంలోని ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉదాంతం. మండలంలో జిల్లాలో ఇతర జిల్లాలలో పట్టణాలలో ఎక్కడైనా సరే వివాదాస్పద భూములు ఉంటే చాలు అది వినబడితే చాలు ఈ ప్రభుత్వ ఉద్యోగి అక్కడ ఎంటర్ అయిపోతాడు. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని సమస్యను సాల్వ్ చేస్తానని కమిషన్కు మాట్లాడుకోవడం లేదా ఖరీదు చేయడం దానిని తన డబ్బు, రాజకీయ పలుకుబడి, సామాజిక వర్గం సపోర్టుతో సాధించి కోట్లకు పడగలెత్తాడు. చేసే ఉద్యోగానికి సైతం సరిగా హాజరు కకుండా ఉన్నతాధికారులను మేనేజ్ చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య , జిల్లా యంత్రాంగాన్ని సైతం తన కనుసైగలతో శాసించగల సత్తా ఉన్న వ్యక్తి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాల మధ్య పంచాయతీల తో ముడిపడిన ఆస్తులపై ఇతడి కన్ను ఎప్పుడూ ఉంటుంది. ఆడ్డీకి పావు చేరుగా అడిగి ముందు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని, తన పలుకుబడితో చక్రం తిప్పి ఆ స్థలాన్ని అమ్మి కమిషన్లతో డబ్బు సంపాదించడం ఇతని ఆనవాయితీ. ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని వారి అందిన ధర కు భూములను కొనడం వాటికి రకరకాల మరమ్మత్తులు చేయడం రియల్ ఎస్టేట్ పేరుతో అమ్మడం, తాను బిల్డర్ నంటూ అతి తక్కువలో బిల్డింగ్ నినిర్మిస్తారనిముందు మాట్లాడుకుని ఒప్పందం చేసుకోవడం ఎదుటి వ్యక్తి ఆర్థిక మరియు ఇతర కుటుంబ వ్యవహారాలను ఆసరా చేసుకొని సొమ్ము చేసుకోవడం ఇతని హాబి, ఇప్పటివరకు మండల వ్యాప్తంగా ఆ ఉద్యోగి నిర్మించిన అంతస్తులన్నీ వివాదాస్పదంగానే ముగిశాయి. కట్టించుకున్న వాళ్లే తప్పయింది అంటూ కాంప్రమైజ్ అయ్యారు తప్ప తన ఆర్థిక లాభాలను వదులుకోకుండా సాధించాడు. అంతేకాదు కాంట్రాక్టర్ ను అంటూ ఇతరుల పేరు మీద నుండి బినామీ కాంట్రాక్టర్గా చేస్తూ అధికారులకు అధిక పర్సంటేజిలుస్తూ నాణ్యత లోపాలతో పనులు చేసి కోట్లు ఆర్థించిన ఘనత సాధించారు. వారసుడు కాకపోయినా లేకపోయినా యాజమాన్యానికి అధికారుల కు మామూలు ఇచ్చి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుని ఇతరులకు అమ్మి ఆస్తులు కూడా పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని, ఎవరి పాపము శాపము తగిలి బిపి షుగర్లతో బాధపడుతున్న సంపాదనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆ వ్యక్తి మండలంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. మంత్రులు రాజకీయ నాయకుల అండదండలతో తన రియల్ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఏదో ఒక రోజు పాపం పండుద్ది ఎవరిది ఒక శాపం తగులుద్ది అని బాధితులు మొత్తుకుంటున్నా లెక్క చేయకపోవడం అతని కుషాగ్ర బుద్ధికి నిదర్శనంగా స్థానికులు పేర్కొంటున్నారు.
అడుగుపెడితే అంతా నాదే అంతా నేనే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



