Wednesday, May 28, 2025
Homeఅంతర్జాతీయంభారత్ దాడి చేస్తే..అణ్వాయుధాలు వేస్తాం: పాక్‌ దౌత్యవేత్త

భారత్ దాడి చేస్తే..అణ్వాయుధాలు వేస్తాం: పాక్‌ దౌత్యవేత్త

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌ , పాకిస్థాన్‌ దేశాల మధ్య మొదలైన ఉద్రిక్తతలు అంతకంతకే పెరుగుతున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆదేశ నేత‌లు బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా రష్యాలోని పాక్‌ దౌత్యవేత్త మహమ్మద్‌ ఖలీద్‌ జమాలీ భారత్‌కు అణు బూచిని చూపించి బెదిరించే ప్రయత్నం చేశారు. ఒకవేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని అన్నారు. రష్యా ఛానల్‌ ఆర్‌టీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు తమను తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయని చెప్పారు. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్‌ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసిందని అన్నారు. ఇదివ‌ర‌కు, భిలావ‌ల్ భుట్టో, ఆదేశ ర‌క్ష‌ణ మంద్రి హ‌ఫిజ్ కారుకూత‌లు కూసిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -