Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంభారత్‌ ఓపిక పడితే..ట్రంప్‌ పేకమేడ కూలడం ఖాయం

భారత్‌ ఓపిక పడితే..ట్రంప్‌ పేకమేడ కూలడం ఖాయం

- Advertisement -

– అమెరికన్‌ ఆర్థికవేత్త స్టీవ్‌ హాంకీ
న్యూఢిల్లీ:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ వార్‌పై స్వదేశంలోనూ వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ సుంకాల వల్ల అమెరికా ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లనుందనే ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. తాజాగా అమెరికా ఆర్థికవేత్త, జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్టీవ్‌ హాంకీ కూడా ఇదేవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిద’నేది నెపోలియన్‌ మాట. ఇప్పుడు ట్రంప్‌ కూడా ప్రపంచదేశాలతో వాణిజ్య యుద్ధాలు చేస్తూ తనను తానే నాశనం చేసుకుంటున్నారని అనిపిస్తోంది. అని అన్నారు. సుంకాల పేరుతో ట్రంప్‌ కడుతున్న పేక మేడ త్వరలోనే కూలిపోతుందని దుయ్యబట్టారు. అప్పటివరకు భారత్‌ ఆయన జోలికి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. జాతీయమీడియాతో మాట్లాడిన స్టీవ్‌ హాంకీ.. భారత్‌పై ట్రంప్‌ విధించిన సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. ”సుంకాలపై ట్రంప్‌ నిర్ణయాలు పూర్తిగా అర్థరహితం. ఇక్కడో విషయం చెప్పాలి. భారత్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌ కొంతకాలం ఓపిక పట్టి ఎదురుచూడాలి. ఎందుకంటే ట్రంప్‌ పేకమేడ త్వరలోనే కూలిపోతుంది” అని ఆ ప్రొఫెసర్‌ అభిప్రాయపడ్డారు. అమెరికన్ల వినిమయ ఖర్చులు పెరిగితే తమ దేశ ద్రవ్యలోటు ఎక్కువవుతుందని హాంకీ అంచనా వేశారు. టారిఫ్‌లపై ట్రంప్‌ విధానాలు చాలా చెత్తగా ఉన్నాయని దుయ్యబట్టారు. దీనివల్ల తమ ఆర్థికవ్యవస్థకే నష్టం చేకూరే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
భారత్‌ను దూరం చేసుకుంటే అమెరికాకే చేటు
జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్‌ బోల్టన్‌

రష్యా, చైనా నుంచి భారత్‌ను దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు ట్రంప్‌ నీరుగార్చారని ఆ దేశ జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్‌ బోల్టన్‌ అన్నారు. చైనా పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ, భారత్‌పై ట్రంప్‌ చూపిస్తున్న పక్షపాతి వైఖరి భవిష్యత్తులో అమెరికాకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img