Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'ప్రేమకి ప్రాణం ఉంటే - నన్ను చెప్పుతో కొట్టుద్ది'

‘ప్రేమకి ప్రాణం ఉంటే – నన్ను చెప్పుతో కొట్టుద్ది’

- Advertisement -

యువ రచయిత గణ రచించిన ‘ప్రేమకి ప్రాణం ఉంటే – నన్ను చెప్పుతో కొట్టుద్ది’ అనే నవల అవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి దర్శకులు సందీప్‌ రెడ్డి వంగా, మెహర్‌ రమేష్‌, శివ నిర్వాణ, సాయి రాజేష్‌ లతో పాటు రచయితలు, దర్శకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరిం చిన సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ, ‘ఈ కార్యక్రమానికి రావడం సంతో షంగా ఉంది. నవల టైటిల్‌ చాలా అద్భుతంగా ఉంది. టైటిల్‌ మాదిరిగానే కంటెంట్‌ కూడా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. రచయిత గణ ఇలాంటి మరెన్నో మంచి నవలలు పాఠకులకు అందించాలి’ అని అన్నారు.
‘ఈ నవలను సగం వరకు చదివాను, చాలా ఆసక్తిగా అనిపించింది. మిగితా సగం కూడా త్వరగానే పూర్తి చేస్తాను. ఇది ఖచ్చితంగా పుస్తక ప్రియులకు ఎంతో చేరువయ్యే నవల. ఇలాంటి రచనలు నేటి సమాజానికి ఎంతో అవసరం’ అని దర్శకుడు శివ నిర్వాణ చెప్పారు.
‘ఈ పుస్తకంలో ప్రేమ చెప్పుతో కాదు… చెబుతూ కొట్టింది’ అంటూ కొన్ని లైన్స్‌ను ఉదహరిస్తూ దర్శకులు మెహర్‌ రమేష్‌ ఈ నవల ఎంతో బాగుందన్నారు. ఇది కచ్చితంగా అందరికి నచ్చుతుందని అభిప్రాయ పడ్డారు. రచయిత గణ మాట్లాడుతూ,’ఈ నవలలో అన్ని రకాల భావోధ్వేగాలు ఉన్నాయి. యువతకు మాత్రమే కాదు అన్ని వయసుల వారిని కట్టిపడేసే విషయం ఉన్న ఈ నవల అమెజాన్‌లో అందుబాటుయుంది. గతంలో నేను రాసిన మరో పుస్తకం ‘ద రియల్‌ యోగి’. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నేపథ్యంలో రాసిన ఈ పుస్తకానికి కూడా చాలా మంచి ఆదరణ వచ్చింది. ఆ పుస్తకం కూడా అమోజాన్‌లో అందుబాటులో ఉంది’ అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad