Tuesday, May 13, 2025
Homeఅంతర్జాతీయంఆధిప్యత ధోరణులు ప్రదర్శిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారు: చైనా

ఆధిప్యత ధోరణులు ప్రదర్శిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారు: చైనా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వేధింపులు, ఆధిప్యత ధోరణులు ప్రదర్శిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. బీజింగ్‌లో లాటిన్ అమెరికన్, కరేబియన్ అధికారుల సమావేశంలో జిన్‌పింగ్ ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లో మార్పులు వేగవంతం అవుతున్నాయని.. దేశాల మధ్య ఐక్యత, సహకారం అనివార్యం అని చెప్పుకొచ్చారు. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరని జిన్ పింగ్ మరోసారి నొక్కి చెప్పారు. అన్ని దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి.. సుస్థిరత సాధ్యమన్నారు. అయితే, అమెరికా చైనా మధ్య టారీఫ్ లకు తాత్కాలిక విరామం ఇచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవ‌ల జెనీవా కేంద్రంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో అమెరికా-చైనా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. టారీఫ్‌ యుద్ధానికి 90 రోజుల పాటు విరామం ఇస్తున్నట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. చైనా వస్తువులపై టారిఫ్‌ రేటును 115% తగ్గించామని, దీంతో 145% సుంకం కాస్తా 30 శాతానికి పరిమితమైందని యూఎస్‌ ట్రేడ్‌ రెప్రెజెంటేటివ్‌ జేమిసన్‌ గ్రీర్‌ ప్రకటించారు. అమెరికా వస్తువులపై చైనా కూడా తన సుంకాన్ని అంతేస్థాయిలో తగ్గించడంతో.. 125% కాస్తా 10 శాతానికి తగ్గింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -