ప్రజా పాలన ప్రభుత్వం విఫలం
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ మండల నాయకుడు వీరగానే మల్లేశం గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు
రైతులు వేసిన పంటకు కావాల్సినంత యూరియాను సకాలంలో అందించకుంటే రైతులను ఏకం చేసి ఉద్యమిస్తామని బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ మండల నాయకుడు వీరగాని మల్లేష్ గౌడ్ బి.ఆర్.ఎస్ నెల్లికుదురు గ్రామ పట్టణ కార్యదర్శి వరిపల్లి వెంకట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించినట్లు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. రైతులు కష్టపడి దుక్కులు దున్ని విత్తనాలు వేసి నాట్లు వేసి ఇతర రకాల పంటలు వేసి ఆ పంటకు వేయవలసిన యురియను సకాలంలో ఇవ్వకపోవడం వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయే పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులు తెచ్చి వ్యవసాయనికి పెట్టుబడి పెట్టి పంటలు పండించుదామని కష్టపడుతున్న తరుణంలో యూరియా బస్తాల కొరతతో రైతాంగం అనేక ఇబ్బందులు పడుతుందని తెలిపారు. అధికారులు ముందస్తు ప్రణాళికలు చేయకపోవడం ప్రభుత్వం రైతాంగని పట్టించుకోకుండా మా రైతన్నలను ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతులు వరి మొక్కజొన్న పత్తి ఇతరత్రా పంటలు వేసి మొదటి దశలో యూరియా వేద్దామని చూస్తున్న తరుణంలో పంటకు సరిపడా యూరియా దొరకక పంట నష్టం జరుగుతుందని అన్నారు.
రెండవ దశ వచ్చిందని, దానికి కూడా యూరియా దొరకకపోవడం రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, రైతులకు కావాల్సినంత యూరియాను వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. రైతాంగం ఇంత ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కెసిఆర్ హయంలో విద్యుత్తు, నీరు, నిధులు, అన్ని రకాల సౌకర్యాలతో తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిని పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చెందారు. మహబూబాబాద్ నియోజకవర్గం అన్ని రంగాలుగా అభివృద్ధి దిశలో నడిచిందని తెలిపారు. నాడు ఇచ్చిన మాట కాంగ్రెస్ నీటి మూటలు అయ్యాయని అన్నారు.