Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeసోపతినేరిస్తే ఎన్నో ఇద్యలు...

నేరిస్తే ఎన్నో ఇద్యలు…

- Advertisement -

చిన్నమ్మా! ఇంటి పని వంట పని అంత అయిందా?
ఆనలు ఒక్క తీర్న కురుస్తుంటే బట్టలు ఎండ్తా నే లెవ్వు,ఉత్క కుండా గట్లనే పెట్టుకోలేం గదా,ఒక్క దినం ముచ్చట కాదు గదా ఇంకా రెండనిల్లలు గిట్లనే కురుస్తాయి వర్షాలు.
అనకాళమేనా ఏ దాన్‌ తీరె గంత,గిప్పటి దాన్క పడ్డ జల్లులు సేన్ల కి మంచిగానె వుంది,ఇంకా మూడ్‌ దీనల్లా జెబర్దస్త్‌ పడితే ఇస్కుళ్ళకి సెలవులిస్తారు అప్పుడు పిల్లలు ఎగుర్తారు, ఇస్కులు లేకున్నా సరే ఉన్నట్లే నిద్ర లెవ్వాలె అలాగ కూసోని ఇస్కుల్లా కూసున్నట్టే కూసోని సద్వుకోండి,ఇస్కుల్లా ఎట్లా కూసోని సద్వుతారో అట్లే సద్వండ్రి.
పద్యాలు గూడ బట్టి పట్టేడుంటే పట్టండి సూడకుండా రాసి పాక్టీసు సేయండి, లెక్కలు ఏమన్న రాకుంటే టిక్కు పెట్టుకొని పాక్టీసు సేయండి, ఇస్కులు టెర్సీ నాక పోయి అడిగి సెప్పించుకోండి.
మన్సుంటే మార్గముంటుంది గదా, గది లేకుంటే ఎం లేదు, గి మనసును ఎప్పుడు గుప్పట్ల ఉంచుకోవాలే,ఏమైనా కష్ట పడితేనే సాధించొచ్చు,సోమరి అయినోడు ఎం సాధించలేదు, పెద్దినాక అందర్నీ బాధించుదె ఎం చిన్నమ్మ! నిజామా గధ సెప్పు?
గ్యాస్పొద్దు అనుషంటుండే, డ్రెస్‌ సెండ్ల కాద ముండ్లు తగిలి సింగిపోయే కొత్తది ఎక్కవ కట్కోలే, అప్పుడు సెప్పిన సినిగిందని ఇస్తూ సేయిద్దు చించి ఎం అన్న వేరే దానికి వాడుకోవొచ్చు అని సెప్పిన.
గా దీనల్లా ఆడపిల్లలు రాకీలు సేసిండ్రు గదా మొగుపోరలు రాకీలు కట్టించుకున్నాక ఎం ఇయ్యాలే జెర చెప్పు పద్దాక, మి దగ్గరున్న పైసల్ని బట్టి సూదులు, దారాలు, కతేరాలు గట్ల కొన్ని గిప్తు లెక్కకొన్ని డబ్బాల పెట్టి ఇయ్యండి.
గట్లంటే మొగపిల్లలకి కూడా గవన్ని కావకే, మొన్న పండ్రాగస్టు పొరలు ఎట్లా జేస్తోరో సుద్దాం అని పోయింటి, కంలేషు పాటలు జెర మంచిగానేపాడిండు, ఎస్పీచు బట్టి పట్టి పోయిండు అక్కుంటా అక్కుంటా సెప్పిండు,జెగదేష్‌ అయితే సినిమా పాటలు కల్పి పాడిండు మంచిగానే అన్పించింది..
ఏమైనా పిలగండ్లకు తీర్‌ తీర్‌ నా తెల్వుంటది గాని మనం చూసి బయటకి తిర్స్లు..
పోయోస్తా చిన్నమ్మ….!!

– గంగరాజ పద్మజ, 9247751121

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad