ప్రస్తుతం గుండె సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు వయసు పెరిగిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తున్నాయి. అకాల మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. అయితే చాలా వరకు గుండె సమస్యలకు మారుతున్న జీవినశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడంతో పాటు వ్యాయామం తగ్గడం వంటి కారణాలు వల్ల గుండె పోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకీ పెరుగుతోన్న గుండె సమస్యల నుంచి బయటపడాలంటే జీవనశైలిలో కచ్చితంగా కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ జీవితంలో మూడు రకాల పనులు చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే..
– గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో వాకింగ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం 30 నిమిషాలు వేగంగా నడవాలని చెబుతున్నారు. వేగంగా నడవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా, గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది.
– హృద్రోగాలు దరిచేరకుండా ఉండాలన్నా, గుండె స్ట్రాంగ్‌గా మారాలన్నా కచ్చితంగా సైకిల్ తొక్కడాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారంలో 4 నుంచి 5 రోజులైనా రోజుకు కనీసం 30 నిమిషాలు సైకిల్ తొక్కడాన్ని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఇది గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రోజూ ఈ మూడు పనులు చేస్తే..
- Advertisement -
- Advertisement -