Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఇంజనీరింగ్ సీటు నచ్చకుంటే రద్దు చేసుకునే వెసులుబాటు కల్పించాలి: ఎస్ఎఫ్ఐ

ఇంజనీరింగ్ సీటు నచ్చకుంటే రద్దు చేసుకునే వెసులుబాటు కల్పించాలి: ఎస్ఎఫ్ఐ

- Advertisement -
  • – ఫీజులను, సర్టిఫికేట్స్ వెనక్కి ఇవ్వలేమని చెబుతున్న కళాశాల పై చర్యలు తీసుకోవాలి
    – విద్యార్ధులకు నష్టం చేస్తూ ప్రైవేటు యాజమాన్యాలకు కోమ్ముగాస్తున్న ఉన్నత విద్యామండలి, కాలేజీయేట్ అధికారులు
  • నవతెలంగాణ – హైదరాబాద్: ఎప్ సెట్ వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొని తమకు నచ్చని కాలేజీలో సీటు వచ్చిన విద్యార్థులు తమ సీటు కాన్సిల్ చేసుకోని ఇతర కోర్సుల్లో చేరేందుకు అవకాశం లేకుండా ఖచ్చితంగా వారికి ఎలాట్ అయిన కళాశాలలో చేరాలని అధికారులు పెట్టిన నిబంధన ఉపయోగించుకోని కోన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు తప్పనిసరి వారి కాలేజీలో చదవాలని లేకపోతే వారు చెల్లించిన ఫీజులను,వారి సర్టీఫికేట్స్ వెనక్కి ఇవ్వబోమని విద్యార్ధులకు తెగెచి చెప్పడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రెండవ ఫెజ్లో సీటు సంపాదించిన విద్యార్థులు తమకు నచ్చని కళాశాలలో సీటు పోందిన తర్వాత ఖచ్చితంగా ఆయా కళాశాలలో రిపోర్ట్ చేసిన తర్వాత,ఫీజులను చెల్లించిన తర్వాతే మూడవ ఫెజ్ కౌన్సెలింగ్ కోసం అర్హులు కావడంతో విద్యార్థులు తమ టి.సి.లు, సర్టీఫికేట్స్ ఇచ్చి ఫీజులను చెల్లించారు.అయితే మూడవ ఫెజ్ లో మంచి కళాశాలలో వస్తుందనే ఆశతో ఫీజులను చెల్లిస్తే ఇప్పుడు తమకు నచ్చిన కోర్సు, కళాశాలలో సీటు పోందలేక పోయారు. ఇదే అవకాశాన్ని తీసుకున్న ప్రైవేటు కళాశాలలు తమను వేధింపులు చేస్తూ డబ్బులు ఇవ్వకుండా ,సర్టీఫికేట్స్ ఇవ్వకుండా వేధింపులు చేస్తున్నారు. అధికారులు కూడా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img