ఊబకాయం.. ఇటీవల ఈ సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇంతకీ ఊబకాయంతో వచ్చే ఆ అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
– అధిక బరువు డయాబెటిక్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న ప్పుడు టైప్-2 మధుమేహం వస్తుంది. అధిక బరువు వున్నవారిలో ప్రతి 10 మందిలో 9 మందిలో ఈ సమస్య కనిపిస్తుంది.
– ఊబకాయం వల్ల కాలేయ ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. అధిక బరువు కొవ్వు కాలేయ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాంటి పరిస్థితిలో, కాలేయంలో కొవ్వు పెరుగుతుంది, ఇది కాలేయం దెబ్బతినడానికి, కాలేయ సిర్రో సిస్, కాలేయ వైఫల్యానికి కూడా దారితీస్తుంది.
– ఇక సాధారణం కంటే ఎక్కువ బరువు ఉన్న వారు రక్తపోటుకు గురయ్యే సమస్య ఎక్కువగా పొంచి ఉంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు, రక్త నాళాల గోడలపై చాలా ప్రభావం చూపుతుంది.
– ఊబకాయం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ద్వారా రక్తపోటు సమస్య పెరుగు తుంది. ఈ రక్తపోటు గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బరువు పెరిగితే..
- Advertisement -
- Advertisement -