Tuesday, March 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆ జలసంధి గుండా వెళ్తే అంతే సంగ‌తులు: ఇరాన్

ఆ జలసంధి గుండా వెళ్తే అంతే సంగ‌తులు: ఇరాన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హార్ముజ్‌ జలసంధిని మూసివేశామని, ఆ జలసంధి గుండా వెళ్లేందుకు ప్రయత్నించే ఏ నౌకపైనైనా కాల్పులు జరుపుతామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ సీనియర్‌ సలహాదారు ఇబ్రహీం జబారీ సోమవారం ప్రకటించారు. నౌకలు ఈ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే దాడి చేస్తామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ పేర్కొన్నట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ప్రపంచ ఆయిల్‌ రవాణాలో ఐదవ వంతు ఈ జలసంధి ద్వారానే సరఫరా అవుతుంది. దీంతో ఈ చర్య చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని కెప్లర్‌ గణాంకాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఇరాన్‌ చర్యతో హార్ముజ్‌ వద్ద 700కి పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్‌ షిప్స్‌ ఉన్నాయి. మార్చి 1వ తేదీన ఈ మార్గం నుంచి బయటకు కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే వెళ్లగా, మార్చి 2న కేవలం ఒక చిన్న ట్యాంకర్‌, కార్గోషిప్‌ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -