– ఈదులూరు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అయితగోని విజయలక్ష్మి
నవతెలంగాణ- కట్టంగూర్ : గ్రామ ప్రజలు ఆదరించి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మండలంలోని ఈదులూరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అయితగోని విజయలక్ష్మినారాయణ అన్నారు. శనివారం గ్రామంలోని తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గతంలో తాను ఎంపీటీసీగా, తన భర్త రెండు పర్యాయాలు సర్పంచ్ గా పని చేసి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేట్టామని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం, చెరువు అలుగు వద్ద వంతెన నిర్మాణంతో పాటు గ్రామంలో మౌలిక వసతులు కల్పించామన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామంలో పెండింగ్ లో ఉన్నసమస్యలనుపరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మీ గ్రామ ఆడ బిడ్డగా అక్కున చేర్చుకొని గ్రామ సర్పంచ్ గెలిపిస్తే ప్రధానమై సమస్య పందనపల్లి, నారెగూడెం రోడ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. గ్రామస్తుల సహకారంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమావ్యక్తం చేశారు.
ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



