Wednesday, May 14, 2025
Homeమానవివేప ఇలా వాడితే…

వేప ఇలా వాడితే…

- Advertisement -

వేప నూనె, పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో మంచి డిటాక్స్‌ గుణాలు కూడా ఉన్నాయి. వేపాకు చర్మంపైన ఉన్న యాక్నే తొలగించ డంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు జుట్టుపై ఉండే చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఆయిలీ స్కీన్‌ నివారణ లో వేప నూనె బాగా పనిచేస్తుంది. చర్మం, దురదలను తగ్గించి ముఖం కాంతివంతంగా చేస్తుంది. వేప జుట్టుకు రాయడం వల్ల చుండ్రు తగ్గుముఖం పడుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.
వేప ఆకులను మెత్తని పేస్ట్‌ మాదిరి తయారు చేసుకుని, అందులో కొద్దిగా రోజ్‌వాటర్‌, పసుపు వేసుకొని ముఖమంతా రాసుకుని ఓ అరగంట తర్వాత ఫేస్‌ వాష్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల యాక్నే తొలగిపోతుంది. ఇక వేపతో తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కూడా కలిపి ముఖానికి ప్యాక్‌ వేయడం వల్ల కాంతివంతంగా మారుతుంది. వేప ఆకులను ఉడికించి మంచి టోనర్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ముఖానికి స్ప్రే చేయడం వల్ల అదనపు నూనెను గ్రహించేస్తుంది. వేప ఆకులను చిన్న ముక్కలుగా కట్‌ చేసి కొబ్బరి నూనెలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నూనెను జుట్టు అంతటికీ అప్లై చేయాలి.. ఇలా చేయడం వల్ల కూడా చుండ్రు తగ్గిపోతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -