Sunday, February 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలునన్ను గెలిపిస్తే మూడో వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా

నన్ను గెలిపిస్తే మూడో వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా

- Advertisement -

– సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి రమేష్
నవతెలంగాణ – ఆలేరు రూరల్

నన్ను గెలిపిస్తే మూడో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని సీపీఐ(ఎం)పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి మొరిగాడి రమేష్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆలేరు పట్టణంలోని మూడో వార్డులో సీపీఐ(ఎం)బలపరిచిన అభ్యర్థిగా ఆయన కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వార్డులో నెలకొన్న మౌలిక వసతుల లోపాలు, డ్రైనేజీ సమస్యలు,తాగునీటి కొరత,రహదారుల దుస్థితి వంటి అంశాలపై ప్రజలు వ్యక్తం చేసిన ఆవేదనను ఆయన శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా మొరిగాడి రమేష్ మాట్లాడుతూ.. మూడో వార్డు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతోంది.గెలిచిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తాం.

తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా నిరంతరం పనిచేస్తాను అని తెలిపారు. సీపీఐ(ఎం) పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికే ఎల్లప్పుడూ నిలబడుతుందని, కార్పొరేట్ శక్తులకు కాదు – సామాన్య ప్రజలకే తమ రాజకీయమని స్పష్టం చేశారు. ప్రజలు ఈ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థికి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎంఏ ఇక్బాల్, ఘణగాని మల్లేష్, మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ కుమార్, మొరిగాడి మహేష్, ఆకుల సత్యనారాయణ, పోతుగంటి సంపత్ కుమార్, చెన్న రాజేష్, మొరిగాడి రాజు, మహావీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -