Sunday, July 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకోరిక‌ తీరిస్తే ప్రిస్క్రిప్షన్‌..అమెరికాలో వైద్యుడినిర్వాకం..!

కోరిక‌ తీరిస్తే ప్రిస్క్రిప్షన్‌..అమెరికాలో వైద్యుడినిర్వాకం..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : అమెరికాలో భారత సంతతి వైద్యుడిపై తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. వైద్యంలో మోసం, ఓపియాయిడ్ల చట్టవిరుద్ధ పంపిణీ, ప్రిస్క్రిప్షన్లకు బదులుగా లైంగిక ప్రయోజనాలను ఆశించడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. న్యూజెర్సీలోని సెకాకస్‌కు చెందిన రితేశ్ కల్రా (51)ను అమెరికా కోర్టు విచారణ తర్వాత గృహ నిర్బంధంలో ఉంచారు. 

అమెరికా న్యాయవాది కార్యాలయం ప్రకారం.. కల్రా తన ఫెయిర్ లాన్ క్లినిక్ నుంచి ప్రాసిక్యూటర్లు ‘పిల్ మిల్’ అని పిలిచే కార్యకలాపాలు నిర్వహించాడు. అక్కడ అతడు రోగులకు ఆక్సికోడోన్ వంటి శక్తివంతమైన ఓపియాయిడ్లను సూచించేవాడు. ఆయన ఇప్పుడు ఐదు ఫెడరల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఇందులో మూడు అక్రమ ఔషధ పంపిణీకి, రెండు ఆరోగ్య సంరక్షణ మోసం కింద నమోదయ్యాయి. 

కల్రా తన వైద్య లైసెన్స్‌ను చికిత్స కోసం కాకుండా వ్యసనంతో బాధపడుతున్న రోగులను దోపిడీ చేయడానికి ఉపయోగించాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 2019 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు అతడు 31,000కి పైగా ఆక్సికోడోన్ ప్రిస్క్రిప్షన్లు జారీ చేశాడని, కొద్ది రోజుల్లో అతడు 50కి పైగా ప్రిస్క్రిప్షన్లు రాశాడని కోర్టు పత్రాలు తెలిపాయి. అటార్నీ అలీనా హబ్బా మాట్లాడుతూ.. “వైద్యులు గొప్ప బాధ్యత కలిగి ఉంటారు. కానీ కల్రా ఆ స్థానాన్ని వ్యసనాన్ని పెంచడానికి, రోగులను సెక్స్ కోసం దోపిడీ చేయడానికి, న్యూజెర్సీ పబ్లిక్ హెల్త్‌కేర్ ప్రోగ్రాంను మోసం చేయడానికి ఉపయోగించాడు” అని అన్నారు.

కల్రా ప్రవర్తనపై మాజీ క్లినిక్ ఉద్యోగులు, రోగులు షాకింగ్ వివరాలు వెల్లడించారు. ఓపియాయిడ్ ప్రిస్క్రిప్షన్ల కోసం మహిళల నుంచి కల్రా ఓరల్ సెక్స్, ఇతర సెక్సువల్ ఫేవర్స్‌ను డిమాండ్ చేశాడని ఆరోపించారు. తాను క్లినిక్ సందర్శనల సమయంలో అనేక సార్లు లైంగిక వేధింపులకు గురయ్యానని, అందులో ‘అనల్ సెక్స్’ కూడా ఉందని ఒక మహిళ ఆరోపించింది.

యూఎస్ మేజిస్ట్రేట్ జడ్జి ఆండ్రే ఎం. ఎస్పినోసా ముందు కోర్టులో హాజరైన కల్రా లక్ష డాలర్ల అన్‌సెక్యూర్డ్ బాండ్‌తో గృహ నిర్బంధానికి పరిమితమయ్యాడు. అతడు వైద్యం చేయడం, మందులు సూచించడాన్ని నిషేధించారు. అతడి క్లినిక్‌ను మూసివేయాలని ఆదేశించారు. ఎసెక్స్ కౌంటీ కరెక్షనల్ ఫెసిలిటీలో ఖైదీకి వైద్య సంప్రదింపులు లేకుండానే ప్రిస్క్రిప్షన్లు జారీ చేసినట్టు కూడా దర్యాప్తు బయటపెట్టింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -