నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ టైంలో పాక్‌కు తుర్కియే, అజర్ బైజాన్ దేశాలు మద్దతగా నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు మిలటరీ సాయంతో పాటు డ్రోన్లు, మిస్సైల్ సరఫరా చేశాయి. దీంతో ఆగ్రహించిన ఇండియన్స్ ఆ దేశాలకు చెందిన పలు రకాల వస్తువులను బాయ్‌కాట్ చేస్తున్నారు. అంతేకాకుండా జేఎన్ యూ, జామియా, లవ్లీ యూనివర్సిటీలు టర్కీ దేశాల విద్యాసంస్థలతో తెగతెంపులు చేసుకున్నాయి. తాజాగా ఆ యూనివర్సిటీల బాటలోనే ఐఐటీ బాంబే వెళ్తోంది. టర్కీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేసింది. ‘తుర్కియేకి సంబంధించిన ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా, తదుపరి నోటీసు వచ్చే వరకు టర్కిష్ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలను ఐఐటీ బాంబే నిలిపివేస్తోంది’ అని ఎక్స్‌లో పేర్కొంది.
ఐఐటీ బాంబే కీలక నిర్ణయం..ఆదేశంతో విద్యాసంబంధాలు నిలిపివేత
- Advertisement -
- Advertisement -