Friday, January 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలురూ..2.5 కోట్ల ప్యాకేజితో చరిత్ర సృష్టించిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి

రూ..2.5 కోట్ల ప్యాకేజితో చరిత్ర సృష్టించిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ- హైదరాబాద్) విద్యార్థి భారీ ప్యాకేజీతో సంచలనం సృష్టించాడు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్‌కు నెదర్లాండ్స్‌కు చెందిన గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ ఏకంగా రూ. 2.5 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. 2008లో ఐఐటీ హైదరాబాద్ ఏర్పాటైన నాటి నుంచి ఇదే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం. ఈ ఆఫర్ రెండు నెలల సమ్మర్ ఇంటర్న్‌షిప్ ద్వారా ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ (పీపీఓ)గా వచ్చింది. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ఇద్దరిలో వర్గీస్ ఒక్కరే పీపీఓ అందుకోవడం గమనార్హం. 21 ఏళ్ల వర్గీస్ జులై నుంచి ఆప్టివర్ నెదర్లాండ్స్ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పూర్తిస్థాయిలో విధుల్లో చేరనున్నాడు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన వర్గీస్, తన తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లేనని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -