నవతెలంగాణ జమ్మికుంట
ఈనెల 23 శనివారము బాలికలకు కబడ్డీ ,కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించబడునని , 25 సోమవారం బాలుర విభాగంలోకబడ్డీ, కోకో, వాలీబాల్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించబడునని ఇల్లందకుంట మండల విద్యాధికారి కొర్ర రాములు నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీలకు గాను వయసు ధ్రువీకరణ 01 జనవరి 2012 అండర్ 14 బాలబాలికలకు , అండర్ 17 బాలబాలికలకు 01 జనవరి 2009 ఉండాలన్నారు. ఇట్టి పోటీలను మండలంలోని సిరిసేడు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించబడునని మండల విద్యాధికారి రాములు నాయక్ తెలిపారు. మరిన్ని వివరాలకు మండల ఎస్ జి ఎఫ్ కార్యదర్శి బి సత్య నారాయణ, ఫిజికల్ డైరెక్టర్ సిరిసేడు సెల్ నెంబర్ 9440 45 84 94 నందు సంప్రదించాలన్నారు.
School Sports SGF Competitions: ఇల్లందకుంట మండల స్థాయి పాఠశాలల క్రీడా ఎస్ జి ఎఫ్ పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES