- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం ధర్మోజీగూడెం దగ్గర అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. స్విఫ్ట్ కారు నంబర్ Ap 28 BW 3382లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. ఆ వాహనంలో IB 180ML – 288 బాటిల్స్, KF Beer 650ML – 60 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అమనిగంటి మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కొయ్యలగూడెం మహాలక్ష్మి వైన్స్ నుండి కొనుగోలు చేసి ఎన్నికల కోసం తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పాడని అధికారులు తెలిపారు. కారును, మద్యం స్టాక్‌ను స్వాధీనం చేసుకుని మధు,వైన్స్ యజమాని పై కేసులు నమోదు చేశారు.
- Advertisement -



