– సంబంధిత వ్యక్తులకు షోకాజు నోటీసులు
నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం బుధవారంపేట గ్రామానికి చెందిన మొగిలి కొమరయ్య ఆరెల్లి కొమురయ్య అనే వ్యక్తులు ఊర చెరువులో అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడేస్తున్నాడని, నీటిపారుదల ఇంజనీర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ లు మాట్లాడుతూ, మొగిలి కొమురయ్యకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని వారు పేర్కొన్నారు అదేవిధంగా ఇవే షోకాజ్ ప్రతులు సంబంధిత రామగిరి తహసిల్దార్, కార్యనిర్వాహక ఇంజనీర్ ఇరిగేషన్ మంథని, కార్యనిర్వాహక ఇంజనీర్ ఇరిగేషన్ పెద్దపల్లి, గారికి పంపించామని అన్నారు. 48 గంటల్లో ఒక వివరణ ఇవ్వకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
బుధవారం పేట ఊర చెరువులో నీరు అక్రమ తొలగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



