నవతెలంగాణ నవాబుపేట: మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా వెంచర్ కు టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారు. మట్టి తరలింపుకు సంబంధించి ఎలాంటి అనుమతి లేకుండా గత వారం రోజులుగా టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తూ వెంచర్ల ఏర్పాటుకు వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలిస్తుంటే ఎవరికి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఈ తతంగమంతా పగలు తరలిస్తే సంబంధించిన అధికారులు చర్యలు చేపడతారని ఉద్దేశంతో అదును చూసి రాత్రి ఏడు గంటలు దాటితే చాలు ప్రారంభించి ప్రతి రోజూ తెల్లారేసరికి వందల కొద్ది టిప్పర్ల మట్టిని తరలిస్తున్న వైనం మైనింగ్, రెవెన్యూ సంబంధించిన అధికారులకు కళ్ళు కట్టినట్టుగా వెంచర్ నిర్వాహకులు మట్టిని తరలించడం ద్వారా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా వెంచర్ ఏర్పాటుపై మట్టి తరలింపుపై సంబంధించిన అధికారులు చొరవ తీసుకొని చట్టపగలమని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు చెబుతున్నారు.



