– వ్యవసాయ పొలంలో పిచ్చి మొక్కలు తొలగిస్తే అటవీ అధికారుల రావడమా
-రైతు ఆవేధన
నవతెలంగాణ-నవాబు పేట: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని పరిసర ప్రాంతాలలో ఉన్న భారీ ఎత్తున విలువైన చెట్లను కలప వ్యాపారులు జిల్లా కేంద్రానికి ఇటుక బట్టీలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.ఇదంతా పగలు సమయంలో చెట్లను నరికి ఒక ప్రాంతంలో లారీల్లో ట్రాక్టర్లలో పేర్చి రాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న వైనం అటవి శాఖ అధికారులకు తెలియడం లేదా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా మండల పరిధిలోని యన్మంగండ్ల గ్రామ శివారులోని రుక్కంపల్లి గ్రామానికి రైతు రాజు తన పొలంలో ఉన్న పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి వ్యవసాయానికి ఆటంకం ఏర్పడింది అని పిచ్చి మొక్కలు తొలగించే సమయంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఓ విలేకరి సహాయంతో అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ రైతుకు లేనిపోని భయభ్రాంతులకు గురి చేసినట్లు రైతు రాజు ఆవేదన చెందుతున్నారు.ఇలా తనను ఇబ్బందులకు గురి చేసి తన పొలంలో ఉన్న కంపచెట్లను తొలగించే సమయంలో వచ్చిన అటవీ అధికారులపై తనపై లేనిపోని నిందలు వేసిన అధికారులకు సమాచారం అందించిన వారిపై సంబంధించిన అటవీ అధికారిపై జిల్లా కలెక్టర్,డీఎఫ్ఓ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
జోరుగా అక్రమ కలప రవాణా..మొద్దు నిద్రలో అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



