Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనారోగ్యం.. మతిస్థిమితం సమస్యలతో 

అనారోగ్యం.. మతిస్థిమితం సమస్యలతో 

- Advertisement -

– ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య 
నవతెలంగాణ – దుబ్బాక 

అనారోగ్య సమస్యలతో పాటు మతిస్థిమితం సరిగా లేని ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక మండల పరిధిలోని రాజక్కపేటలో శనివారం ఉదయం జరిగింది. దుబ్బాక ఎస్హె చ్ఓ కే. కీర్తిరాజు తెలిపిన వివరాలు.. ఇదే గ్రామానికి చెందిన తోగుట చంద్రయ్య (69) అనే రైతు వ్యవసాయం చేస్తూ భార్యతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఓ కుమారుడు, కుమార్తె ల వివాహలు జరిపించాడు. కొంతకాలంగా మధ్యానికి విపరీతంగా బానిసైన చంద్రయ్య.. తరచుగా అనారోగ్యానికి గురవుతూ మతిస్థిమితం కోల్పోతూ ఉండేవాడు. శనివారం ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్లిన చంద్రయ్య గ్రామ శివారులోని కాలువ పక్కన గల ఓ రేకుల షెడ్డులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పంచనామ నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాకలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య లక్ష్మవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -