Friday, January 30, 2026
E-PAPER
HomeNewsఐఎమ్ వెరీ సారీ:ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి..వీడియో

ఐఎమ్ వెరీ సారీ:ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ ఐపీఎస్‌ అధికారుల సంఘానికి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీసులు, అధికారులు అంటే తనకు గౌరవం ఉందని.. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. “నేను ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు.. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు.. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను.అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కావు.. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను.. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నాను” అని వీడియోలో చెప్పారు.

కాగా.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ అధికారుల సంఘం సీరియస్‌ అయ్యింది.. కరీంనగర్‌ సీపీతో పాటు పోలీసులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.. పోలీసులపై పాడి కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది.. కౌశిక్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకుంటామని ఐపీఎస్‌ అధికారుల సంఘం స్పష్టం చేసింది. ఐఏఎస్‌ల డిమాండ్‌కు దిగివచ్చిన కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -