నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతన్న విషయం తెలిసిందే. పలు రోజులనుంచి కురుస్తున్న వర్షాలకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జమ్ముకశ్మీర్, హిమచల్ ప్రదేశ్, పంజాబ్ లతో దక్షణాన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహారాష్ట్ర, కర్నాటక, కేరళ తదితర రాష్టాల్లో పలు రోజులనుంచి భారీ కురుస్తున్నాయి. దీంతో వరద ఉదృతి పెరిగి ఆయా రాష్ట్రాల్లోని నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. అదే విధంగా పలు రిజర్వాయర్ల నిండుకున్నాయి. నీటి సామర్ధ్యానికి మించి జలాశయాల్లో వరద నీరు ప్రవహించడంతో..ఆయా ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేసి..నీటిని దిగువకు వదులుతున్నారు.
తాజాగా హర్యానాకు భారీ వర్షాలతోపాటు పిడుగులు పడనున్నాయని భారత్ వాతావరణ శాఖ హెచ్చరించింది.ఆ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.