– డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్
నవతెలంగాణ – కామారెడ్డి
కేంద్ర సామాజిక న్యాయం శాఖ స్వతంత్ర మంత్రి రాందాస్ అతవలేని కలిసి సామాజిక న్యాయం కోసం, రాజ్యాంగ పరమైన హక్కుల కోసం ఓబీసీ లకు రావాల్సిన రాజకీయ, ఆర్థిక వాటా ను అమలు చేయాలని కోరిన తెలంగాణ ముదిరాజ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్, ఆర్.టి.ఐ రాష్ట్రఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ కలిసి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం హైదరాబాద్ లోని హరిత భవన్ జరిగిన సమావేశంలో ఆయన ను కలిసి మాట్లాడినట్టు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సంఖ్యలో ఉన్న ఓబీసీ జాతులను రెండవ స్థాయి పౌరులుగా చూస్తున్న ప్రభుత్వానికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఆర్థికంగా ఓబీసీ జాతులను ఆదుకోవడానికి ఓబీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని కోరారు. ఈ డబ్ల్యూఎస్ ( EWS ) రిజర్వేష్ వల్ల ఓబీసీ జాతులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.ఓబీసీ ల రక్షణ చట్టం కేంద్రంలో తీసుక రావాలని కోరారు. మహిళా రిజర్వేషన్ చట్టంలో ఓబీసీ మహిళల వాటాను స్పష్టంగా పేర్కొనాలని కోరారు.



