Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్అండర్ సెక్షన్ 163 బి.ఎన్.ఎస్ అమలు

అండర్ సెక్షన్ 163 బి.ఎన్.ఎస్ అమలు

- Advertisement -

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల సిఈటి – 2025 లోని జిల్లా లోని అన్ని పరీక్ష కేంద్రాలలో 2025-26 సంవత్సరానికి 1 సంవత్సరం ఇంటర్మీడియట్‌లో ప్రవేశం కోసం మే 10 న ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య,  నిషేధిత ఆదేశాలు మంగళవారం జారీ చేశారు. కావున నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ముందస్తు గా నిరోధించాలనే ఉద్దేశ్యంతో అండర్ సెక్షన్ 163 బి.ఎన్.ఎస్ అమలులో ఉంటుంది అని తెలియజేశారు. అండర్ సెక్షన్ 163 బి.ఎన్.ఎస్ ప్రకారం..ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమి కూడరాదు. నిషేదిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరుగవద్దు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్‌లను 10-05-2025 (ఉదయం 07.00 నుండి సాయంత్రం 2:00 గంటల వరకు) మూసివేయాలి అని, నిషేధిత ఉత్తర్వులు 10-05-2025 (ఉదయం 07:00 నుండి సాయంత్రం 2:00 వరకు) అమలులో ఉంటాయి అని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -