నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. యూఎస్ యుద్ధ సన్నాహాలతో ఆ రెండు దేశాల మధ్య ఏ క్షణ్ణమైనా యుద్ధం ప్రారంభంకావొచ్చు. దీంతో అప్రమత్తమైన భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లోని ఇండియా పౌరులకు మన దేశ ఎంబసీ (Indian Embassy in Iran) తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా ఇరాన్‌ను తక్షణమే విడిచిపెట్టి వెళ్లండి. భారతీయ పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండండి. ఇరాన్‌లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని, అలాగే తాజా పరిణామాల కోసం స్థానిక మీడియాను గమనిస్తూ ఉండాలని పేర్కొంది.
ఇరాన్‌లోని భారతీయు పౌరులకు కీలక సూచన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



