నవతెలంగాణ బెంగళూరు: ‘‘ప్రజాస్వామ్యంలో చట్టసభలు ప్రజలకు దేవాలయాలు. ఇక్కడ జరిగే చర్చలు ప్రజల ఆకాంక్షలకు ప్రతీక. చర్చలు నిర్మాణాత్మకంగా జరగాలి. రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు అర్ధరాత్రి వరకు జరిగాయి. ప్రతి శాసనసభలో సంవత్సరంలో విధిగా ఎన్ని రోజుల సమావేశాలు జరగాలనేది నిర్ణయించాలి. నూతన సభ్యులకు అవగాహన, శిక్షణ తరగతులను నిర్వహించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బెంగళూరులో జరుగుతున్న 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్‌లో శనివారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. సీపీఏ సమావేశాల్లో చర్చల సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ‘‘ప్రజల నమ్మకాన్ని పెంపొందించడానికి చట్టసభలు కృషి చేయడం, ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడం’’ అనే అంశంపై మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో చట్టసభలు ప్రజలకు దేవాలయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES