Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రత్యేక భారీ సెట్‌లో..

ప్రత్యేక భారీ సెట్‌లో..

- Advertisement -

రామ్‌ హీరోగా, మహేష్‌ బాబు.పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నెల రోజుల కొత్త షెడ్యూల్‌ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్మించిన సెట్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం రామ్‌, భాగ్యశ్రీ బోర్సే పై ప్రేమ సన్నివేశాలను నైట్‌ బ్యాక్‌ డ్రాప్‌లో చిత్రీకరి స్తున్నారు. ఈ నైట్‌ షెడ్యూల్‌ 10 రోజుల పాటు కొనసాగు తుంది. ఆ తర్వాత క్లైమాక్స్‌, ఇతర కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి టీమ్‌ 20 రోజులు డే టైమ్‌ షూటింగ్‌కి షిఫ్ట్‌ అవుతుంది. ఈ చివరి షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -