Wednesday, March 18, 2026
E-PAPER
Homeసినిమా'పిఠాపురంలో..' మూడు భిన్న ప్రేమకథలు

‘పిఠాపురంలో..’ మూడు భిన్న ప్రేమకథలు

- Advertisement -

మహేష్‌ చంద్ర దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌, పథ్వీరాజ్‌, కేదార్‌ శంకర్‌ తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’.
దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. మహేష్‌ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై దుండిగళ్ళ బాలకష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్‌.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు.
జి.సి. క్రిష్‌ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని ‘మక్కుళు మక్కుళు కాలేజూ యవ్వన మర్కట గ్యారేజూ’ పాటను దర్శకుడు వి.వి. వినాయక్‌ ఆవిష్కరించారు. ఈ పాటను శ్రీరామ్‌ తపస్వి రాశారు.
ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ, ‘నేను కో డైరెక్టర్‌గా చంద్ర మహేష్‌ దగ్గర ‘చెప్పాలని ఉంది’ చిత్రానికి పనిచేశాను. ఆ తర్వాత ‘ఆది’ సినిమాతో దర్శకుణ్ణి అయ్యాను. చంద్ర మహేష్‌ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నిర్మాత డి. రామానాయుడుకి ఇష్టమైన దర్శకుల్లో చంద్ర మహేష్‌ ఒకరు. ఆయన యూత్‌ ఫుల్‌ ఎంటర్టైన్మెంట్‌గా మూడువిభిన్న ప్రేమ కథలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పెద్ద హిట్టు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుం టున్నాను. అలాగే నిర్మాతలకు మంచి లాభాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని చెప్పారు.
‘ఈ వారంలో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం. నా కెరీర్‌లోనే ఇదొక మంచి సినిమాగా నిలిచిపోతుంది’ అని దర్శకుడు చంద్ర మహేష్‌ తెలిపారు.
మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్‌, విరాట్‌, సాయి ప్రణీత్‌, శ్రీలు, ప్రత్యూష, రెహానా, జీతీ. పవన్‌ కళ్యాణ్‌, ప్రసాద్‌, పాల్‌ రాము, జబర్దస్త్‌ శేషు తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -