Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి 

సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి 

- Advertisement -

– నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి
– ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్
నవతెలంగాణ –  కామారెడ్డి

సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనీ ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్{ AIJACTO}.  పిలుపు మేరకు యుఎస్పిసి   తరపున టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ అనిల్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్త సైన్స్ ఫెయిర్ శిబిరంలో ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్  దేశవ్యాప్తంగా నిరసన పిలుపుమేరకు నల్ల బ్యాడ్జీల ప్రదర్శనతో నిరసన తెలపడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆలిండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ రాష్ట్ర బాధ్యులు సిహెచ్ అనిల్ కుమార్  మాట్లాడుతూ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులందరూ అన్ని అర్హతలతోనే ఉపాధ్యాయులుగా నియమితులయ్యారనీ,  2010 కి ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు ఈ టెట్ నిర్వహించడం వలన ఆర్థికంగా మానసికంగా ఉపాధ్యాయులు చాలా నష్టపోతున్నారు.  నూతన జాతీయ విద్యా విధానాన్ని సవరణ చేసి టెట్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట మాట్లాడుతూ ఏఐజేఏ సీటిఓ  దేశవ్యాప్తంగా చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ జాతీయ నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక  ఉపాధ్యాయుల  ఓటు హక్కు కల్పించాలని వారికి ఓటుని ఇవ్వకపోవడం ఉపాధ్యాయ వర్గాన్ని అవమానించినట్టుగా భావిస్తున్నామని కావున ప్రాథమిక ఉపాధ్యాయులందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. టిపిటిఎఫ్  జిల్లా అధ్యక్షులు లింగం మాట్లాడుతూ జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు దేవుల మాట్లాడుతూ పాఠశాలల మూసివేతను వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ నాయకులు నారాయణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్,టి పి ఆర్ టి యు  జిల్లా అధ్యక్షులు అంబిర్ మనోహర్, టి పి టి ఎఫ్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, డిటిఎఫ్ నాయకులు ప్రభాకర్, పిఎస్ హెచ్ఎం జిల్లా నాయకులు శ్రీహరి, సంఘం నాయకులు రాములు, సిపిఎస్ సంఘం జిల్లా నాయకులు కుంట ఎల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి, బాలయ్య, రాజేష్, ప్రవీన, సరిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -