Monday, March 9, 2026
E-PAPER
Homeఆటలుటాస్ విష‌యంలో కివీస్ అదే పంథా..!

టాస్ విష‌యంలో కివీస్ అదే పంథా..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అహ్మ‌దాబాద్ వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ తుది పోరు ప్రారంభ‌మైంది. ఇండియా-న్యూజిలాండ్ జ‌ట్లు టైటిల్ కోసం అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈక్ర‌మంలో కివీస్ టాస్ విష‌యంలో వ్యుహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వ‌నించింది. సౌతాఫ్రికాతో జ‌రిగిన తొలి సెమీ ఫైల‌న్ పోరులో కూడా కివీస్ ఇదే స్ట్రాటజీని అనుస‌రించింది. త‌క్కువ స్కోర్‌కే స‌ఫారీల‌ను క‌ట్ట‌డి చేసి సునాయాసంగా విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు వ‌చ్చింది. అయితే రెండో సెమీ పోరులో ఇంగ్లాండ్ కూడా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన టీమిండియా భారీ స్కోర్ న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. తాజా మ్యాచ్‌లో భార‌త్ ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -