Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకృష్ణా, గోదావరి జలాల్లో..ఎవరికి లొంగేది,బెదిరేది లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

కృష్ణా, గోదావరి జలాల్లో..ఎవరికి లొంగేది,బెదిరేది లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌:
ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు.. బెదిరేది లేదని.. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను తీసుకుని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. 4 కోట్ల ప్రజల పక్షాన తెలంగాణ హక్కులను సాధించుకుంటామన్నారు. 79 భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ప్రపంచ నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్‎ను మరింత తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని.. ఇందు కోసం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంటరీని రూపొందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యమెంటరీని ఈ ఏడాది డిసెంబర్ కల్లా రిలీజ్ చేసి జాతికి అంకితమిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం గోదావరిలో కలిసిపోయిందని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాలోని ప్రతి చుక్కా నీటిని తీసుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad