- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే నెల 1 నుంచి ఆధార్ సేవల రుసుములు పెరగనున్నాయి. ఆధార్ లో తప్పుల సవరణ లేదా వివరాల అప్‌డేట్ కోసం ఇంతవరకు రూ.50 వసూలు చేస్తుండగా రూ.75కు పెంచుతున్నట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDF) తెలిపింది. 7-15 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు, 17 సంవత్సరాల వయసు దాటిన వారికి తప్పనిసరి బయోమెట్రిక్ అప్ డేట్ రుసుమును రూ.100 నుంచి రూ.125కు పెంచారు. యూఐడీఏఐ పోర్టల్ ద్వారా నేరుగా పొందే సేవల రుసుమును రూ.50 నుంచి రూ.75 పెంచారు. పోయిన ఆధార్ స్థానంలో కొత్తది కావాలంటే దరఖాస్తు ఫీజు రూ.40 చెల్లించాల్సి ఉంటుంది.
- Advertisement -