Thursday, August 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండిగ్రీలో పెరిగిన అడ్మిషన్లు

డిగ్రీలో పెరిగిన అడ్మిషన్లు

- Advertisement -

– గతేడాది కన్నా అధికంగా 919 మంది విద్యార్థులు చేరిక
– దోస్త్‌ ప్రత్యేక విడతలో 54,048 మందికి సీట్ల కేటాయింపుొ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు 8
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత విద్యాసంవత్సరం కంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రవేశాలు పొందడమే ఇందుకు నిదర్శనం. గత విద్యాసంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో 1,96,820 మంది విద్యార్థులు చేరారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇప్పటి వరకు 1,97,739 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. దీంతో గత విద్యాసంవత్సరం కంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలో 919 మంది విద్యార్థులు అధికంగా చేరారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఉన్నది. అందులో సుమారు ఐదు వేల నుంచి పది వేల మంది విద్యార్థులు చేరే అవకాశమున్నది.
దీంతో డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ప్రస్తుత విద్యాసంవత్సరంలో రెండు లక్షలు దాటనున్నది. అయితే 2025-26 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 960 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 4,38,926 సీట్లున్నాయి. ఇప్పటి వరకు కేవలం 1,97,739 (45.05 శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. డిగ్రీ కాలేజీల్లో ఇంకా 2,41,187 (54.95 శాతం) సీట్లు మిగిలాయి. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) పరిధిలో 823 కాలేజీలున్నాయి. వాటిలో 3,78,386 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాలు పూర్తయ్యే నాటికి 1,71,284 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,07,102 సీట్లు మిగిలే ఉన్నాయి. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలు 28, గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలు 22, బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు 29 కలిపి మొత్తం 79 కాలేజీల్లో 23,614 సీట్లున్నాయి. ఇప్పటి వరకు 11,329 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఇంకా 12,285 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో దోస్త్‌ పరిధిలో లేకుండా కోర్టు ఆదేశాలతో 58 కాలేజీలు నడుస్తున్నాయి. ఆ కాలేజీల్లో 36,926 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 15,126 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఆ కాలేజీల్లో ఇంకా 21,800 సీట్లు మిగిలాయి.
కామర్స్‌లో 22,328 మందికి సీట్లు
దోస్త్‌ ప్రత్యేక విడతలో కామర్స్‌లో 22,328 మందికి సీట్లు కేటాయించామని బాలకిష్టారెడ్డి, శ్రీదేవసేన పేర్కొన్నారు. ఫిజికల్‌ సైన్సెస్‌లో 12,211 మంది, లైఫ్‌ సైన్సెస్‌ (జీవ శాస్త్రాలు)లో 10,435 మంది, ఆర్ట్స్‌లో 8,979 మంది, ఇతర కోర్సుల్లో 95 మంది కలిపి మొతం 54,048 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా విద్యార్థులకు సమాచారం అందించామని తెలిపారు. దోస్త్‌ లాగిన్‌లో విద్యార్థులు రూ.500 లేదా రూ.వెయ్యి చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ఈనెల ఎనిమిదో తేదీ వరకు ఉందని తెలిపారు. ప్రత్యేక విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల ఎనిమిదో తేదీ వరకు రిపోర్టు చేయాలని సూచించారు. ఒకవేళ రిపోర్టు చేయకుంటే ఆ సీటును కోల్పోతారని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://సశీర్‌.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
ప్రత్యేక విడతలో 54,048 మందికి సీట్ల కేటాయింపు
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ప్రత్యేక విడత సీట్లను ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ కేటాయించాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌, దోస్త్‌ కన్వీనర్‌ వి బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దోస్త్‌ ప్రత్యేక విడతలో 54,048 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. మొదటి ప్రాధాన్యత ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు 44,889 మంది ఉన్నారని తెలిపారు. రెండో ప్రాధాన్యత, ఇతర ప్రాధాన్యత ద్వారా 9,159 మంది సీట్లు పొందారని పేర్కొన్నారు. సరిపోయినన్ని వెబ్‌ఆప్షన్లను నమోదు చేయకపోవడం వల్ల 3,290 మందికి సీట్లు కేటాయించలేదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -