ముడి పామాయిల్ కు మెరుగైన ధర..
వచ్చే నెల గెలలు ధర పెరిగే అవకాశం..
వేయి మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి సాధించిన పవర్ ప్లాంట్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
పామాయిల్ గెలలు దిగుబడి గత ఆయిల్ ఇయర్ నవంబర్ 2023 – అక్టోబర్ 2024) కంటే ఈ ఏడాది ఆయిల్ ఇయర్ (24 -25 ) పెరిగింది. ఈ నెల ముడి పామాయిల్ ధర సైతం రూ.లక్ష పైబడి అమ్ముడు అయింది.దీంతో ఆగస్ట్ నెల లో గెలలు ధరలు సైతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అశ్వారావుపేట,అప్పారావు పేట ఆయిల్ ఫెడ్ పరిశ్రమల మేనేజర్ లు కళ్యాణ్ గౌడ్,నాగబాబు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నవి.
గత ఏడాది ఆయిల్ ఇయర్ లో 9 నెలల్లో మొత్తం 1,18,468.420 మెట్రిక్ టన్నుల గెలలు దిగుబడి కాగా ఈ ఏడాది ఆయిల్ ఇయర్ గడిచిన 9 నెలల్లో 1,81,834.450 మెట్రిక్ టన్నుల గెలలు దిగుబడి అయ్యాయి.గతేడాది కంటే ఈ ఏడాది 63,366.030 మెట్రిక్ టన్నుల గెలలు అదనంగా దిగుబడి అయ్యాయి. జులై నెలలో మొత్తం 38,200 మెట్రిక్ టన్నుల గెలలు గానుగ పొట్టిగా ఓఈఆర్ సైతం 19.72 శాతంగా ఉంది.ఈ నెలలో ముడి ఆయిల్ ఒక మెట్రిక్ టన్ను రూ.లక్ష పైబడి అమ్ముడు పోయింది.
ఈ ఫలితాలు కారంగా జులై గెలలు ధర కంటే ఆగస్ట్ నెలలో టన్ను గెలలు ధర కొద్ది మొత్తం లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అశ్వారావుపేట పరిశ్రమ అనుబంధ పవర్ ప్లాంట్ సైతం 1000 మెగా వాట్ ల విద్యుత్ ఉత్పత్తి మైలు రాయి దాటింది.2024 అక్టోబర్ ప్రారంభించిన ఈ పవర్ ప్లాంట్ ఇప్పటి వరకు 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో ఆయిల్ ఫెడ్ కు ఎన్పీడీసీఎల్ చెల్లించే విద్యుత్ బిల్లులు సుమారు రూ.70 నుండి 80 లక్షలు ఆదా అయినట్లు తెలుస్తుంది.