Saturday, December 6, 2025
E-PAPER
HomeఆటలుIND vs SA: జైస్వాల్ సెంచరీ... సిరీస్‌ కైవసం

IND vs SA: జైస్వాల్ సెంచరీ… సిరీస్‌ కైవసం

- Advertisement -

నవతెలంగాణ విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటయ్యారు. ఈ లక్ష్యాన్ని టీమ్ఇండియా 39.5 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (116*; 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌) శతకం చేయగా.. రోహిత్ శర్మ (75; 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (65*; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో జట్టును విజయ తీరాలకు చేరచ్చారు.

రోహిత్, జైస్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్, కోహ్లీ అభేద్యమైన రెండో వికెట్‌కు 84 బంతుల్లో 116 పరుగులు జోడించి భారత్‌కు ఘన విజయం అందించారు. జైస్వాల్‌కు వన్డేల్లో ఇది శతకం కావడం విశేషం. 75 బంతుల్లో అర్ధ శతకం చేసిన జైస్వాల్.. మరో 36 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు.

సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (106; 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ చేయగా.. తెంబా బావుమా (48; 67 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. డెవాల్డ్ బ్రెవిస్ (29), మాథ్యూ బ్రిట్జ్కే (24), కేశవ్ మహరాజ్ (20*), మార్కో యాన్సెన్ (17) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్‌ కృష్ణ 4, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -