- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నేడు జమ్మూకశ్మీర్‌లో జరగాల్సిన 79 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రద్దు అయ్యాయి.. మెరుపువేగంతో సంభవించిన క్లౌడ్ బరస్ట్ కారణంగా 50 మంది మృతి చెందగా.. 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 220 మంది గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీనగర్లోని బక్షి స్టేడియంలో జరగనున్న ఈ వేడుకల్లో కొద్దిపాటి అధికారిక కార్యక్రమాలు తప్ప మిగతా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసారు.
- Advertisement -