Wednesday, March 11, 2026
E-PAPER
Homeజాతీయంపార్ల‌మెంట్ ఎదుట‌ ఇండియా బ్లాక్ ఎంపీల నిర‌స‌న‌

పార్ల‌మెంట్ ఎదుట‌ ఇండియా బ్లాక్ ఎంపీల నిర‌స‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో రెండో రోజు కూడా కాంగ్రెస్ ఎంపీలు నిర‌స‌న తెలిపారు. మోడీ రాజీప‌డ్డార‌ని పార్ల‌మెంట్ మ‌క‌ర ద్వారం వ‌ద్ద బ్యాన‌ర్ చేత‌బూని బైటాయించారు. మోడీ స‌ర్కార్ అనాలోచిత నిర్ణ‌యాల‌తో దేశంలో గ్యాస్ నిల్వ‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని విమ‌ర్శించారు. ఉభ‌య స‌భ‌ల్లో ఎల్పీజీ సిలిండర్‌ల నిల్వ‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేశారు. స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించ‌కుండా మోడీ ప్ర‌భుత్వం బాధ్య‌త‌రాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని, స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌ల‌కు దూరంగా ఉంటుంద‌ని మండిప‌డ్డారు. “”2022లో దిగుమతులను తగ్గిస్తామని ప్రధాని మోదీ చెప్పారు, కానీ బదులుగా మేము ఇతర దేశాలపై ఆధారపడుతున్నాము. మన తక్షణ చర్యలపై పార్లమెంటులో వివరణాత్మక చర్చ జరగాలి. యుద్ధం ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ఈ(బీజేపీ) ప్రభుత్వం తన బాధ్యతల నుండి పారిపోతోంది, ఇండియా బ్లాక్ ఎంపీలు వాపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -