నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో 400 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది సైనిక చర్య ముసుగులో జరిగిన మారణహోమం అని, పాకిస్థాన్ చర్య క్షమించరానిదని మండిపడింది. ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. “ఇది పిరికిపంద చర్య, క్షమించరాని హింస. సైనిక లక్ష్యం కాని ఒక వైద్య సదుపాయంపై దాడి చేసి ఇంత మంది పౌరుల ప్రాణాలను తీయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించలేం. పాకిస్థాన్ ఇప్పుడు ఒక మారణకాండకు సైనిక చర్య అని పేరు పెట్టే ప్రయత్నం చేస్తోంది” అని తన ప్రకటనలో పేర్కొంది.
ఆసుపత్రిపై పాకిస్థాన్ దాడి..ఖండించిన భారత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



