– కెఎల్ రాహుల్ సెంచరీ, పోరాడిన పంత్
లార్డ్స్ : లార్డ్స్ టెస్ట్‌లో భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ శతకంతో మెరిసాడు. లంచ్ తర్వాత ఆర్చర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి మూడంకెల స్కోర్ అందుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడికిది రెండో శతకం కాగా.. ఓవరాల్‌గా టెస్టుల్లో పదో సెంచరీ. అలాగే కెఎల్ రాహుల్ లార్డ్స్ మైదానంలో సెంచరీ కొట్టడం ఇది రెండోసారి. దీంతో ఈ మైదానంలో రెండు సెంచరీలు కొట్టిన రెండో భారతీయుడిగా కెఎల్ రాహుల్ నిలిచాడు. అంతకుముందు దిలీప్ వెంగ్‌సర్కార్ మూడు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. సెంచరీ కొట్టిన తర్వాత బషీర్ ఓవర్లో హ్యారీ బ్రూక్‌కు సులువుగా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓవర్‌నైట్‌స్కోర్ 3వికెట్ల నష్టానికి 145పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన భారత బ్యాటర్లు తొలుత ఆచి తూచి ఆడారు. ఈ క్రమంలోనే కెఎల్ రాహుల్ సెంచరీ రెండు పరుగుల దూరంలో ఉండగా.. రిషబ్ పంత్ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు. రిషబ్ పంత్(74) ఔటయ్యాక అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. ఆ సమయానికి భారత్ 4వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్(98) క్రీజ్‌లో ఉన్నాడు. కడపటి వార్తలందే సమయానికి భారతజట్టు 6వికెట్ల నష్టానికి 340పరుగులు చేసింది. జడేజా(52), సుందర్(5) క్రీజ్‌లో ఉన్నారు.
రిఫబ్ పంత్ రనౌట్
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ సుదీర్ఘ ఫార్మాట్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో రాణించాడు. క్రీజులో ఉన్నంత సేపు స్వీప్ షాట్లతో, ఒంటి చేతి సిక్సర్లతో ఆకట్టుకునే పంత్.. లార్డ్స్ టెస్టులోనూ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. ఈసారి అతడు గాయం తాలుకు నొప్పిని పంటిబిగువున భరిస్తూనే అభిమానులను రంజింపజేశాడు. ఈ క్రమంలోనే పంత్ టెస్టుల్లో రనౌటయ్యాడు. వ్యక్తిగత స్కోర్ 74పరుగుల వద్ద పంత్ రనౌట్ కాగా.. కెఎల్ రాహుల్-పంత్ జోడీ 141పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరిద్దరూ మూడోరోజు ఆటలో భాగంగా తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ ఆడారు. సింగిల్ తీసే క్రమంలో పంత్.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డైరెక్ట్ త్రోకు పంత్ రనౌటై పెవీలియన్‌కు చేరాడు. ఆ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు లంచ్ విరామానికి వెళ్లారు.
స్కోర్‌బోర్డు :
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387పరుగులు
ఇండియా తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి)బ్రూక్ (బి)ఆర్చర్ 13, కెఎల్ రాహుల్ (సి)బ్రూక్ (బి)బషీర్ 100, కరణ్ నాయర్ (సి)రూట్ (బి)స్టోక్స్ 40, గిల్ (సి)జేమీ స్మిత్ (బి)వోక్స్ 16, పంత్ (రనౌట్) స్టోక్స్ 74, జడేజా (బ్యాటింగ్) 52, నితీశ్ కుమార్ రెడ్డి (సి)జేమీ స్మిత్ (బి)స్టోక్స్ 30, సుందర్ (బ్యాటింగ్) 5, అదనం 10. (102ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 340 పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/74, 3/107, 4/248, 5/254, 6/326
బౌలింగ్: వోక్స్ 23-3-81-1, ఆర్చర్ 21-6-45-1, కర్సే 18-2-74-0, స్టోక్స్ 19-4-59-2, బషీర్ 14.5-2-59-1, రూట్ 7.1-0-17-0.
పట్టుబిగిస్తున్న భారత్
- Advertisement -
- Advertisement -