నవతెలంగాణ-హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో T20లో భారత్ ఘోర పరాజయన్ని మూటకట్టుకుంది. భారత జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యింది.125 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో పూర్తి చేసింది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచి ముందుగా ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఆస్ట్రేలియ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును చేరుకున్నారు.అభిషేక్ శర్మ 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా 33 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మిగతా బ్యాటరలంతా సింగిల్ డిజిట్ పరుగులకే ఔటయ్యారు. దీంతో గౌతమ్ గంభీర్ స్ట్రాటజీపై క్రికెట్ ప్రేమికుల నుంచి, భారత అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
రెండో T20లో భారత్ ఓటమి
- Advertisement -
- Advertisement -

 
                                    