Wednesday, November 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఓట‌మి అంచున ఇండియా..90/5

ఓట‌మి అంచున ఇండియా..90/5

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఇండియా ఓట‌మి అంచున ఉన్న‌ది. అయిదో రోజు భార‌త టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. టీ బ్రేక్ స‌మ‌యానికి ఇండియా 47 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 90 ర‌న్స్ చేసింది. ఇవాళ తొలి సెష‌న్‌లో 31 ఓవ‌ర్లు బౌలింగ్ చేశారు. స్పిన్న‌ర్ హార్మ‌ర్ త‌న ఖాతాలో నాలుగు వికెట్లు వేసుకున్నాడు. 549 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇండియా.. ఇంకా 459 ర‌న్స్ వెనుక‌బ‌డి ఉన్న‌ది. ఒక‌వేళ ఇండియా ఈ మ్యాచ్‌లో ఓడిపోతే, అప్పుడు టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోవాల్సి వ‌స్తుంది. ప్ర‌స్తుతం క్రీజ్‌లో సాయి సుద‌ర్శ‌న్‌, జ‌డేజా ఉన్నారు. ఇద్ద‌రూ త‌మ డిఫెన్స్ టెక్నిక్ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సాయి సుద‌ర్శ‌న్ 138 బంతుల్లో 14 ర‌న్స్ చేశాడు. ఇండియ‌న్ బ్యాట‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ 5, ద్రువ్ జురెల్ 2, రిష‌బ్ పంత్ 13 ర‌న్స్ చేసి ఔట‌య్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -