Saturday, February 14, 2026
E-PAPER
Homeఆటలుభారత్-పాక్ మ్యాచ్ అంటేనే తీవ్ర ఒత్తిడి: కెప్టెన్ సూర్య

భారత్-పాక్ మ్యాచ్ అంటేనే తీవ్ర ఒత్తిడి: కెప్టెన్ సూర్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో రేపు (ఫిబ్రవరి 15) పాకిస్థాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడుతున్నాడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం నాడు జరగనున్న దాయాదుల సమరంపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సూర్యకుమార్ ఈ విషయాన్ని ధృవీకరించాడు.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి సూర్యకుమార్ మాట్లాడుతూ.. “రేపు అభిషేక్ ఆడతాడు. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. ఇది మరో సాధారణ మ్యాచ్ కాదు, ఒక ప్రత్యేకమైన సందర్భం. మేం తరచుగా వాళ్లతో ఆడడం లేదు కాబట్టి ఒత్తిడి సహజం” అని అన్నాడు. మ్యాచ్‌కు వర్షం ముప్పుపై స్పందిస్తూ, “వాతావరణం మన చేతుల్లో లేదు. మంచి క్రికెట్ ఆడటమే మా నియంత్రణలో ఉంది. ఇక్కడి పరిస్థితులు మాకు అలవాటే” అని తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -