Monday, May 12, 2025
Homeజాతీయంహాట్‌లైన్ వేదిక‌గా భార‌త్-పాక్ మ‌ధ్య చ‌ర్చ‌లు షురూ

హాట్‌లైన్ వేదిక‌గా భార‌త్-పాక్ మ‌ధ్య చ‌ర్చ‌లు షురూ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాల్పుల విరమణకు ఒప్పందం కుదరిన వేళ భారత్‌ , పాకిస్తాన్మధ్య హాట్‌లైన్‌లో ఇరు దేశాల డైరెక్టర్ అండ్ జ‌న‌ర‌ల్ మిలిట‌రీ ఆప‌రేష‌న్స్ (DGMO)ల చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ భేటీలో భారత డీజీఎంవో లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ , పాకిస్థాన్‌ డీజీఎంవో మేజర్‌ జనరల్‌ కాశిఫ్‌ చౌదరి పాల్గొన్నారు. అయితే, ఈ భేటీలో ప్రధానంగా కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల తగ్గింపు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ పై చర్చించనున్నారు. పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో తీసుకున్న దౌత్య పరమైన కఠిన నిర్ణయాలు, సింధూ జలాల అంశంలో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -