- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళల ప్రపంచకప్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి ఆలౌటైంది. మహిళల ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. భారత్ బ్యాటర్లలో ప్రతికా రావల్ (75), స్మృతి మంధాన (80) అర్ధశతకాలతో చెలరేగారు. డియోల్ (38), రోడ్రిగ్స్ (33), రిచా ఘోష్ (32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆస్ట్రేలియా బౌలరల్లో అన్నాబెల్ 5 వికెట్లు పడగొట్టి… టీమ్‌ఇండియా వేగానికి కళ్లెం వేసింది. సోఫీ 3, మేగన్, గార్డెనర్ తలో వికెట్ తీశారు.
- Advertisement -